
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
బ్యాంకుతో లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేసి, భాషను ఎంచుకుని డబ్బు బదిలీ లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని వారు కూడా సులభంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు.