
చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు క్షిపణి లాంచర్లు రవాణా అవుతున్నాయని, దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రిక కథనం వెల్లడించింది.
సైనికులు భుజాలపై ఉంచి ప్రయోగించే 300 నుంచి 400 క్షిపణుల సరఫరా కోసం చైనా-ఇరాన్ మధ్య 70 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం.
ఈ పరిణామంతో అమెరికాతో సన్నిహితంగా ఉండే పాకిస్థాన్ దౌత్యపరంగా ఇరకాటంలో పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.