
విటమిన్ B12 లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, తరచుగా తలతిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చర్మం పసుపు రంగులోకి మారడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటివి కూడా ఈ లోపానికి సంకేతాలు.
దీర్ఘకాలిక B12 లోపం నరాలకు నష్టం కలిగిస్తుందని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.