
గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్ సిటీ పోలీసులు శనివారం సంబురాలు చేసుకున్నారు.
సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె.మూర్తితో కలిసి సీపీ సజ్జనర్ సరదాగా స్టెప్పులేశారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్‌ను దాదాపు 30 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని సీపీ తెలిపారు.