ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ గోల్డ్ లోన్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి, 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200-300 బ్రాంచులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
రాబోయే మూడేళ్లలో ఈ బ్రాంచుల సంఖ్యను 1000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఈ ప్రకటనతో ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేరు ధర స్టాక్ మార్కెట్‌లో 2.50 శాతం లాభంతో రూ.406.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది.