
రోజూ ఉదయాన్నే పరగడుపున సొంపు నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది.
సొంపులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మెటబాలిజాన్ని వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సొంపు గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం మరిగించి గోరువెచ్చగా తాగడం వల్ల మధుమేహగ్రస్తులకు మంచి ఫలితం ఉంటుంది.