తెలంగాణలోని అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ ఫీజుల వివరాలను నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లు మరియు విద్యాశాఖ పోర్టల్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించడంతో, యాజమాన్యాలు వెంటనే ఫీజుల వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.