
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 'బాంబే క్రీమరీ' పేరుతో ఐస్‌క్రీమ్ వ్యాపారంలోకి ప్రవేశించింది.
ఈ బ్రాండ్ కింద ఐస్‌క్రీమ్ ధరలు రూ.10 నుండి ప్రారంభమవుతాయని, ఇవి కోన్లు, కప్పులు, టబ్స్ రూపాల్లో లభిస్తాయని సంస్థ తెలిపింది.
మొదట పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి రానున్న ఈ ఉత్పత్తులు, త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.