
భూతాపం మరియు వాతావరణ మార్పుల కారణంగా స్విట్జర్లాండ్లోని గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నాయి.
గత ఐదేళ్లలో స్విస్ హిమనీనదాలు 20 శాతం మంచును కోల్పోగా, ఒక్క ఈ ఏడాదే 5 శాతానికి పైగా నష్టం వాటిల్లింది.
జులై నుంచి సెప్టెంబర్ మధ్య కరిగిన మంచు కారణంగా సుమారు 2.2 లక్షల కోట్ల లీటర్ల నీరు నదుల్లోకి చేరిందని నివేదికలు తెలిపాయి.