
మలేసియాలోని ఫారెస్ట్ సిటీలో స్థానిక పోలీసులు జరిపిన దాడుల్లో అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాను పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 335 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సైబర్ నేరాలకు అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లను పోలీసులు గుర్తించి మూసివేశారు.