
యూకేలో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న రుఖ్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో గెలుపొందారు.
పీఎంఎల్-ఎన్ పార్టీ అభ్యర్థిగా మీర్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, 2024లో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులచే అరెస్ట్ అయ్యారు.
బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆయనపై యూకేలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.