
వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం తన తల్లి సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె ఈ రాజకీయ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తూ తన ఎన్నికల ప్రణాళికలను వెల్లడించారు.