
16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 45 ఏళ్ల ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జిమ్నాస్టిక్స్ కోచ్ గణేశ్ ప్రభాకర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
బాధితురాలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోచ్‌ను సంప్రదించి జిమ్నాసియంకు వెళ్లగా, అక్కడ కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన పీఈటీ టీచర్ ఆరా తీయడంతో విషయం వెలుగులోకి రావడంతో విలెపార్లే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.