
బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
గత 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అత్యధికంగా 9.35 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.