గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్డులో జరిగిన లారీ-కారు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం కుమార్తె ఆసిఫా (24) మృతి చెందారు.
ఆదివారం స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగగా, నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేస్తూ, ఆసిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.