
హైదరాబాద్‌లోని కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్డులో 4 ఎకరాల విస్తీర్ణంలో ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు 'ట్రంప్ టవర్స్' ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులో 65 అంతస్తుల ఎత్తు కలిగిన రెండు భారీ టవర్లు ఉండనుండగా, సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో 450కి పైగా నివాసాలను నిర్మిస్తున్నారు.
ఇళ్ల ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఉండగా, ప్రాజెక్ట్ పూర్తయ్యాక రూ.3,500 కోట్ల ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.