కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్తో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సెప్టెంబర్ 25న విడుదలైన కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
మౌత్ టాక్ కారణంగా పుంజుకున్న ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే రూ. 135 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ఈ వసూళ్లతో కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో KGF: చాప్టర్-1 (రూ. 134.2 కోట్లు) రికార్డును వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో నిలిచింది.