
హీరో తేజ సజ్జ తొలిసారిగా 'ది ట్రెయిటర్స్ తెలుగు' రియాలిటీ షోతో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుండగా, మంగళవారం దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పోటీపడనున్నారు మరియు మొత్తం 10 ఎపిసోడ్లుగా ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇది స్ట్రీమింగ్ కానుంది.