
ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో ఆదివారం ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, 12 మందిని రక్షించారు.
ప్రమాదానికి కారణమైన హాస్టల్ యజమాని హరిరాం బన్సల్‌ను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేయగా, ఎంసీడీ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది.
ఈ ఘటనపై ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, నగరంలోని ఐదు అంతస్తుల భవనాలన్నింటినీ సీల్ చేయాలని సీఎం ఆదేశించారు.