
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం సబ్సిడీని 2028 మార్చి 31 వరకు పొడిగించారు.
అక్టోబరు 1, 2024న ప్రారంభమైన ఈ పథకం కింద రూ. 1.50 లక్షల లోపు ధర గల ఈవీ బైకులకు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా రాయితీ లభిస్తుంది.
ప్రస్తుతం కిలోవాట్‌కు రూ. 2,500 చొప్పున గరిష్ఠంగా రూ. 5,000 వరకు సబ్సిడీ లభించనుండగా, గతంలో ఇది కిలోవాట్‌కు రూ. 5,000 చొప్పున గరిష్ఠంగా రూ. 10,000 ఉండేది.