
ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు చెందిన యువత ఆన్లైన్ స్కాం ముఠాల బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు ఉపాధి పేరుతో యువతను ఆకర్షించి, వారిని బందీలుగా మార్చి అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని నివేదిక పేర్కొంది.
ఈ ముఠాల అరాచకాలను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని ఐరాస సభ్య దేశాలకు సూచించింది.