
బ్యాంకింగ్ వ్యవస్థలో అదనంగా ఉన్న నగదు లభ్యతను నియంత్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు కీలక చర్య చేపట్టింది.
వేరియబుల్ రేట్ రివర్స్ రెపో వేలం ద్వారా బ్యాంకుల నుంచి ఏకంగా రూ.2,10,192 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది.
మొదటి వేలంలో రూ.2 లక్షల కోట్లను తీసుకునేందుకు నోటిఫై చేయగా బ్యాంకులు రూ.2,10,688 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి.