
గుంటూరుకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి నిహారిక చల్లా ఫిడే ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్‌ను సాధించింది.
గత ఏడు నెలల్లో 300లకు పైగా ఎలో రేటింగ్ పాయింట్లు సాధించిన నిహారిక, ప్రస్తుతం 2282 ఎలో రేటింగ్ పాయింట్లతో నిలిచింది.
సెర్బియా, హంగేరి మరియు స్పెయిన్ దేశాల్లో జరిగిన టోర్నీలలో వరుసగా మూడు ఐఎం నార్మ్స్ సాధించి ఆమె ఈ ఘనతను అందుకుంది.