
వాట్సాప్లో నకిలీ పేరు, ఫొటోతో జరిగిన భారీ సైబర్ మోసంలో బాధితుడికి కోల్పోయిన రూ.కోటిని సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారు.
కేవలం 10 రోజుల్లోనే సాంకేతిక ఆధారాలతో మ్యూల్ ఖాతాలను గుర్తించి ఈ మొత్తాన్ని తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేశారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సైబరాబాద్ సీపీ ప్రజలకు సూచించారు.