
ఏపీలో అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేల నుంచి రూ. 15 వేల వరకు పింఛన్లు అందుతున్నాయి.
కర్నూలు జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా కొత్తగా లబ్ధి పొందే అవకాశం ఉండగా, దరఖాస్తులను స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది.