
టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో తరచూ మార్పులు చేయవద్దని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సూచించాడు.
సుమారు 16 నుంచి 20 మందితో ఒక కోర్ జట్టును సిద్ధం చేసి, ఆటగాళ్లు రాణించినా విఫలమైనా వారిపై నమ్మకం ఉంచాలని కోచ్ గౌతమ్ గంభీర్‌కు సలహా ఇచ్చాడు.
ఆస్ట్రేలియా జట్టును ఉదాహరణగా పేర్కొంటూ, మ్యాచ్ విన్నర్లను గుర్తించి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు.