
దేశంలో పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు అవసరమని, ప్రశ్నపత్రాల లీకేజీలను అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సూచించారు.
పరీక్ష జరిగే రోజే AI సాయంతో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తే లీకేజీల సమస్యను తగ్గించవచ్చని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) విధానాన్ని విస్తరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.