
హైదరాబాద్‌కు చెందిన యువ ఇంజినీర్ ఆదిత్య అరేపల్లి అమెరికాలోని సియాటిల్‌లో గల అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) లో రూ.1.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు.
2022లో IIIT ధార్వాడ్ నుండి బీటెక్ పూర్తి చేసిన ఆదిత్య, ప్రారంభంలో రూ.13 లక్షల వేతనంతో రివర్‌బెడ్ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు.
ఆ తర్వాత ఉద్యోగం వదిలి న్యూయార్క్‌లోని యూనివర్సిటీ ఎట్ బఫెలోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో మాస్టర్స్ పూర్తి చేసి ఈ ఘనత సాధించారు.