
2026 డిసెంబర్లో తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు తాను ప్లాన్ చేసిన పర్యటనను కేంద్రం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అనుమతులు రద్దు చేసి తెలంగాణ రాష్ట్రానికి అవమానం కలిగించిందని ఆయన విమర్శించారు.
ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా పర్యటనను మధ్యలో రద్దు చేయడం వెనుక తెలంగాణపై కక్ష, వివక్ష ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.