
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా షూటింగ్లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్కు కిమ్స్ ఆసుపత్రిలో బుధవారం విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స జరిగింది.
వైద్యుల బృందం తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన పూర్తిగా కోలుకోవడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుందని వెల్లడించారు.
సర్జరీ తర్వాత ఎన్టీఆర్ త్వరలోనే ప్రత్యేక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్లు కిమ్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు తెలిపారు.