
కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన కీలక రికార్డులు బయటకు రావడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది.
పదేళ్ల క్రితం తీసుకొచ్చిన 'ఇ-సినీప్రమాణ్' పోర్టల్‌లో తలెత్తిన భద్రతా లోపం కారణంగా నిర్మాతలు సమర్పించిన పూర్తి స్క్రిప్ట్‌లు ఆన్‌లైన్ వేదికల్లో ప్రత్యక్షమయ్యాయి.
డిజిటల్ లైబ్రరీ 'ఇంటర్నెట్ ఆర్కైవ్'లో ఈ ఫైళ్లు కనిపించడంతో ఆ సంస్థ వెంటనే వాటిని తొలగించి సైబర్ పోలీసులకు సమాచారం అందించింది.