
చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికా రాష్ట్రాలు, ప్రభుత్వంతో మెటా సంస్థ 18 బిలియన్ డాలర్ల (రూ. 1.72 లక్షల కోట్లు) సెటిల్మెంట్కు అంగీకరించింది.
ఈ భారీ పరిహారాన్ని రాబోయే పదేళ్ల కాలంలో విడతల వారీగా చెల్లించేందుకు మెటా సిద్ధమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
సెటిల్మెంట్లో భాగంగా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో వయసు నిర్ధారణ చెక్స్‌ను కఠినతరం చేయడంతో పాటు స్కూలు వేళల్లో సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించాల్సి ఉంటుంది.