
మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక తీవ్ర గాయాలతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.
అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో ఘర్షణలో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు, ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని స్పష్టం చేశారు.