
ప్రభుత్వ గురుకులంలో చదివి నీట్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందుకు సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ ఆర్థిక సాయం అందజేశారు.
తండ్రి తాత్కాలిక స్కావెంజర్, తల్లి దినసరి కూలీగా పనిచేస్తున్నప్పటికీ, కష్టపడి చదివి ఈ ప్రతిభ కనబరిచింది.
విద్యార్థిని చదువుకు భవిష్యత్తులో కూడా అన్ని విధాల అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.