
ఏపీ మద్యం రవాణా స్కామ్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మద్యం రవాణాకు సంబంధించిన అక్రమాలపై నమోదైన కేసులో కారుమూరి నాగేశ్వరరావుకు ఊరట లభించలేదు.
బుధవారం జరిగిన విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించడంతో కేసులో తదుపరి చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది.