
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ హై స్కూల్ విద్యార్థులు డివిజన్ స్థాయి క్రీడా పోటీల్లో తమ ప్రతిభను చాటారు.
సుల్తానాబాద్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో రాణించారు.
దీంతో కొలనూరు విద్యార్థులు పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.