
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి తన 71వ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటున్నారు.
తొంభైల తరం ప్రేక్షకులకు స్ఫూర్తిగా, నేటి జెన్‌జీకి వైబ్‌గా నిలుస్తున్న చిరంజీవి సినీ ప్రస్థానంపై ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి.
ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.