
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో 2023 సీజన్‌లో రోజుకు 6,766 లీటర్ల మూత్రం పోగవ్వడం వల్ల సుమారు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
బేస్‌క్యాంప్‌లో వంట, విద్యుత్ కోసం వాడే ఎల్‌పీజీ, కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాల వల్ల జరిగే మంచు కరుగుదల వాటా 94 శాతంగా ఉంది.
బేస్‌క్యాంప్ పరిసరాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు ఏటా 0.28 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతున్నాయని, సౌరశక్తిపై ఆధారపడటం తక్షణ అవసరమని అధ్యయనం పేర్కొంది.