
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఎక్సైజ్ అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వం వ్యతిరేకించలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సదరు అధికారిని అప్రూవర్‌గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెవిరెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు.
వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం, చెవిరెడ్డి పిటిషన్లో విచారించాల్సిన అంశాలేవీ లేవని స్పష్టం చేస్తూ కేసును డిస్మిస్ చేసింది.