
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ సహా పలువురు నాయకులను కేశవపట్నం పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు.
అరెస్ట్ అయిన వారిలో ఉప సర్పంచ్ ప్రవీణ్, శ్రీకాంత్ గౌడ్, కంపెనీ శ్రీనివాస్, కొరిమి తిరుపతి, మొలుగూరి శ్రీనివాస్, పోచయ్య, రమేష్ వంటి కీలక కార్యకర్తలు ఉన్నారు.
పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీకి తరలి వెళ్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో శంకరపట్నం ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.