
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 28.18 శాతం బీసీ రిజర్వేషన్లను ఏపీ కేబినెట్ ఆమోదించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని, వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోగా మిగతా వాటిలో 50 శాతం మించకుండా బీసీ రిజర్వేషన్లు కేటాయించామని మంత్రులు తెలిపారు.