
పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ నగరంలో ఐక్యరాజ్యసమితి రాజకీయ మిషన్ (UNAMA)కు చెందిన ఇద్దరు సిబ్బందిని తాలిబాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఆదివారం అరెస్టు చేసింది.
అరెస్టుకు గల కారణాలను తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించలేదని, సిబ్బందిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఐరాస డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు.
2021 ఆగస్టు 15న తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటి నుండి మహిళల విద్య, ఉద్యోగాలపై ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.