
మాండ్య జిల్లాలోని ఆరతి ఉక్కడ ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న పీఎస్ఐ సవితపై ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య దాడి చేశారు.
నిబంధనల ప్రకారం వేచి ఉండాలని కోరినందుకు ఐశ్వర్య తనను చెంపదెబ్బ కొట్టి, కెరీర్ నాశనం చేస్తానని బెదిరించారని పీఎస్ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై యాతనహళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్యపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఆమె కూడా పోలీసు అధికారిణిపై తిరుగు ఫిర్యాదు చేశారు.