
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల అఫిడవిట్లు మరోసారి చర్చనీయాంశం కాగా, కేసీఆర్ ఆస్తుల వృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
2004 ఎన్నికల అఫిడవిట్లో ఒక్క ఎకరం కూడా భూమి లేనట్లు కేసీఆర్ పేర్కొన్నారని, కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని నిలదీశారు.
అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం, పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని చెబుతోందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు.