
దక్షిణ యెమెన్‌లోని షాబ్వా గవర్నరేట్‌లో గల అల్-అలామ్ సైనిక శిబిరంపై హౌతీ రెబల్స్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు.
సోమవారం ఉదయం కొత్త రిక్రూట్లకు శిక్షణ ఇస్తుండగా జరిగిన ఈ దాడిలో చికిత్స పొందుతూ మరణించిన సైనికుల సంఖ్య 53కి చేరింది మరియు మరో 200 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ చీఫ్ రషాద్ అల్-అలిమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.