హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.
మొత్తం 284 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ ప్రాజెక్టులో హైదరాబాద్-విజయవాడ మధ్య 226 కి.మీ, విజయవాడ-మచిలీపట్నం మధ్య 58 కి.మీ రహదారిని అభివృద్ధి చేస్తారు.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) తుది ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ మరియు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.