
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో గదులను అక్రమంగా పొంది, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు బి. శ్రీనివాస్, ఇరప్ప కాలప్ప, విష్ణు వర్ధన్, అమూల్ కుమార్ సింగ్, ఎస్. ప్రకాష్, పి. సందీప్ వద్ద నుంచి గది బుకింగ్‌లకు ఉపయోగించిన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా ఆగస్టు 6న తిరుమల పీఏసీ-5 వద్ద భక్తుల సెల్‌ఫోన్లను దొంగిలించినట్లు విచారణలో తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.