
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు మహిళలు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.
మృతుల్లో యాదమ్మ, పద్మమ్మ, పద్మ ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, ప్రమీల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు; ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.