
తెలుగు నటి సురేఖావాణి తన రెండో పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన 'నిరమ్' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స్పష్టత ఇచ్చారు.
తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఉండుంటే ఇన్ని రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని సురేఖావాణి తెలిపారు.
తన కూతురు సుప్రీతకు పెళ్లి చేసే వయసు వచ్చిందని, ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని ఆమె నవ్వుతూ చెప్పారు.