
పెద్దదోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మెర్సీ సేవా సంస్థ, నౌ ప్రాజెక్టు సహకారంతో విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, ప్లేట్లు, గ్లాసులను అందజేసి, వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించారు.
వైఎస్సార్‌సీపీ కార్యదర్శి సింగా ప్రసాద్ పాల్గొని, అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.